Saturday, June 14, 2008

అక్షరధామ్ -కొత్తఢిల్లీ

అక్షరధామ్ గురించి తెలుసుకొనె ముందు స్వామి నారాయణ్ గురుంచి తెలుసుకొందం
-స్వామి నారాయణ్ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యకు సమీపంలో వున్న ఛాపయ్యా గ్రామంలో 1781 లో ఆయన జన్మించాడు. ఏడవ ఏటనే పవిత్ర గ్రంథాల్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. నాలుగేళ్ళ తర్వాత ఆధ్యాత్మిక యాత్రీకుడిగా ఇల్లు వదిలి వెళ్ళాడు. ఏడేళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి, వివిధ సంస్కృతీ రూపాల్ని ఆకళింపుజేసుకుని, చివరకు గుజరాత్‍లో స్థిరపడ్డాడు. సాంఘీక- ఆధ్యాత్మిక విప్లవానికి నాందిపలికి ' స్వామి నారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు. ఆ తర్వాత నలబైతొమ్మిదేళ్ళు ఈ భూమ్మీద జీవించి, తన వారసుల దీక్షవ్వారా, తన బోధనల ప్రాచుర్యం ద్వారా, తాను అమలుపరచిన సంప్రదాయం "అక్షరం" (వినాశనం లేనిది) గా కొనసాగే మార్గం సుగమం చేశాడు.

ఆ సంప్రదాయానికి చెందిన బ్రహ్మ స్వరూప్ యోగీజి మహారాజ్ 1968 లో యమునాతీరాన ఒక స్మారక భవనం నిర్మించాలని ఆకాక్షించారు. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు బొచాసన్‍వాసి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో రెండు దశాబ్దాల కృషి ఫలితంగా నేటి స్వామి నారాయణ్ అక్షరధామ్ వెలిసింది.

అక్షరధామ్ -కొత్తఢిల్లీలో :

భారతదేశ రాజధాని నగరమైన కొత్తఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. నవంబర్ 7వ 2005 తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో "నొయిడా క్రాసింగ్" వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకది ప్రతీక.

అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో , ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్".


నిర్మాణ కళాశైలి
రాజస్తాన్ ‍లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు , పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. మొదటిదైన అక్షరధామ్ గుజరాత్ ‍కు చెందిన గాంధీనగరలో దేశంలో వెలిస్తే, ఢిల్లీలోని ఈ అక్షరధామ్ రెండవది. బదరీనాథ్, కేదార్‍నాథ్, సోమనాథ్, కోణార్క్ ఆలయాల భవన నిర్మాణ కళాశైలి ఈ స్మారక భవన నిర్మాణానికి స్పూర్తి. వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే ఈ అక్షరధాంని మలచడం ఒక విశేషం. అక్షరధామ్ వంద ఎకరాల భూభాగం హృదయస్థానంలో భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో, 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో చూపరులను ఈ భవనం దిగ్ర్భాంతికి లోనుచేస్తుంది.

ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల "పరిక్రమ" స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టివుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో , 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది.


అక్షరధామ్-శిల్ప శోభస్మారక భవన రూప విషయానికొస్తే అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఆ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తుంటాయి. 148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు, కాంగ్రా చిత్తరువులు, 20,000 దేవతా విగ్రహాలు, పురాణ,ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనం లొని ప్రతి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.

కెంపు రంగులో వున్న ప్రహరీ గోడలు చాలా ఎత్తైనవి. దాటరానివి, ఈ బృహన్మందిర నిర్మాణానికి రాళ్ళెత్తిన వారి సంఖ్య 11,000 అయితే, వ్యయం దాదాపు రెండువందల కోట్లు. ప్రపంచమంతటా విస్తరించివున్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకుపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్ప శోభ ఎంత మహొన్నతమైనవో ఊహాతీతం.


అక్షరధామ్-రంగురంగుల కాంతులుప్రధాన మందిరం పక్కనే "యజ్ఞపురుష్ ‍కుండ్" అనే జలాశయం తారసపడుతుంది. మతాచార కర్మకాండల నిమిత్తం నిర్మించినఈ జలాశయం, 300క్ష్300 అడుగుల కొలతతో, 2870 మెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞకుండమని చెబుతారు[2]. రాతి మెట్ల దిగుడు బావి వంటి ఈ తటాకంలో వేదోక్తమయిన యజ్ఞకుండం కూడ ఏర్పాటైవుంది. దాని నడుమ రంగు రంగులుగా వుండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. ఆ కాసారమేగాక స్మారకభవన సముదాయంలో ఆకర్షణీయమైన స్థావరాలు మరికొన్ని వున్నాయి. అందులో "నారాయణ్ సరోవర్" ఒకటి. స్వామి నారాయణులవారు క్రుంగు విడినవిగా భావించబడిన 151 పుణ్యనదీజలాలు ఈ సరోవరంలో నిక్షిప్తమై వున్నాయని ప్రతీతి.


ఉద్యానవనం:
ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధాం వస్తే మొట్టమొదటగా ఈ విశాలమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో పొదలు, ఫౌంటెయిన్లతో పాటుగా బోలెడన్ని కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. స్వాతంత్రోద్యమంలో అమరులైన వీరుల, జాతీయ నాయకుల, శాస్త్రజ్ఞుల మరియు పురాణాలలోని పిల్లల , స్త్రీపురుషులలు కంచు విగ్రహాలు ఈ ఉద్యానవనం లొ ఉన్నాయి.[3] దాదాపు 9,00,000 పొదలు, మొక్కలు నాటిన ఈ వనం ధ్యాన ప్రదేశంగా ఉపయోగిస్తారు.



ప్రదర్శనశాలలు :
సినిమా ప్రదర్శనశాలల్లో అత్యాధునికమైనది "ఐమాక్స్" భవన సముదాయంలోని మూడు ప్రదర్శనశాలల్లో ఒకటైన "నీలకంఠ్ దర్శన్"లో ఈ ఐమాక్స్ ధియేటర్ నెలకొల్పబడివుంది. ఈ ధియేటర్‍లో స్వామి నారాయణ్ 11 ఏళ్ళ బాలయోగి బాల్యం 45 నిమిషాల సిన్మాగా అవిష్కృతమౌతుంది. దాని పేరు "మిస్టిక్ ఇండియా- యాన్ ఇన్‍క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇన్‍స్పిరేషన్". ఆ చిత్రానికి దర్శకుడు హాలీవుడ్‍కు చెందినటువంటి కెయిత్ మెల్ట్‍న్. బాలయోగినుంచి ఒక మతశాఖకు వ్యవస్థాపకుడిగా స్వామి నారాయణ్ ఎదిగిన తీరుకది చిత్రణ. మానససరోవర శోభ, ఆహారం కోసం మృగరాజు తపన, కొండకోనల మీదుగా విమాన విహారాలు- ఆయౌగి ప్రస్థానంలో తారసపడే ఈ దృశ్యాలన్నీ సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి.

ఈ సినిమా విశేషమేమంటే అందులో 45,000 మంది కళాకారులు పాల్గొనడమేగాక, అది 108 యాత్రా కేంద్రాలలో చిత్రీకరించబడడం, జనవరి 2005 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో నిర్వహించబడిన పదవ అంతర్జాతీయ లార్జ్‍ఫార్మాట్ ఫిలిం ఫెస్టివల్ (విస్తృత పరిమాణంలో చిత్రాల ప్రదర్శనోత్సవం) లో ప్రేక్షకుల ఎంపిక పురస్కారాన్ని గెలుచుకోవడంకూడా ఆ చిత్రం ప్రత్యేకతే.


సహజానంద దర్శన్
రెండు తటాకాల చూట్టూన్మించబడిన ఈ మూడు ప్రదర్శనశాలల్లో రెండవది "సహజానంద దర్శన్". సజీవ భ్రాంతి కలిగించేటటువంటి మట్టి ప్రతిమలతో, చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో, స్వామి నారాయణ్ భగవాన్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన అవిష్కరిస్తుంది. అందుకుగాను పదిహేను త్రీడైమెన్ష్‍న్ డయోరమాలు (వర్ణ చిత్ర ప్రదర్శన యంత్రాలు) ఉపయోగించబడుతున్నాయి. పెద్ద సెట్టింగులు, శిల్పాలు, రోబోటిక్స్, పైబర్ ఆప్టిక్స్ వంటి సంకేతిక శబ్ద సాధనాలు, సంభాషణలు, సంగీతం కూడా నియోగించబడడంతో ప్రేక్షకుల కనులముందు 18వ శతాబ్ద వాతావరణం పునఃసృష్టించారు.


సంస్కృతి విహార్
మూడవ ప్రదర్శనశాల " సంస్కృతి విహార్ " భూగర్బంలో ఏర్పాటైన ఒక కృత్రిమ నదిలో ఒక పడవలో మీరు ప్రయాణించవలసివుంటుంది. ఆ పడవ షికారు ద్వారా పదివేల సంవత్సరాల భారతీయ సంస్కృతీ నాగరికతలు మీకు ఆనదీ తీరాన పరిచయమవుతాయి. పన్నెండు నిమిషాల పాటు సాగే ఆ శ్రవ్య-దృశ్య ప్రదర్శన మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది. అంత సుదీర్ఘకాలంలో మనదేశంలో కొనసాగిన ఆధ్యాత్మిక, శాస్ర్తీయ, చారిత్రక పరిశోధనలు, పరిణామాలను మీరు దర్శించడమేగాక ఆనాటి ఋషి శాస్త్రజ్ఞుల పరిశోధనా పలితాలు మీకు సుగ్రాహ్యమవుతాయి. అజంతా-ఎల్లోరా శిల్పాల నమూనాలతో బాటు ప్రపంచపు ప్రప్రధమ విశ్వవిద్యాలయమైన తక్షశిలకూడా మీకు అక్కడి శ్రవ్య-దృశ్య ప్రదర్శన ద్వారా దృగ్గోచరమవుతుంది.




ఆ బ్యాప్స్ సంస్థ ఢిల్లీలోనే కాదు విశ్వవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో అలాంటి స్మారకభవన సమూదాయాలను 600 లకు పైగా నిర్మించింది. ప్రముఖ్ స్వామి ఆధ్వర్యంలో 200 కోట్ల వ్యయంతో , 11,000 మందికి మించిన పనివారితో 7000 వాలంటీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి, అయిదేళ్ళలో ఆ సాంస్కృతిక విద్యా ప్రబోధ, వినోద కేంద్రం నిర్మించారు. ఆ నిర్మాణం ఎంత దృడమైందంటే, ఎలాంటి భూకంపాలనైనా తట్టుకొని, వెయ్యి సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా మనగలదు. ఇంత పరమాద్భుతమయిన స్వామి నారాయణ్ అక్షరధామ్ యుగయుగాలుగా పరిఢవిల్లుతోన్న భారతీయ సంస్కృతీ, ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ సంస్కృతి సౌందర్యాన్ని, దానిలో నిక్షిప్తమైవున్న అపారవిజ్ఞానం, పరమానందాలను ఆ భవనసందర్శనం ద్వారా మనం ఆకళించుకోగలుగుతాము. ప్రాచీన భవన నిర్మాణ శిల్ప సంప్రదాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిళితమై నయన మనోరంజకత్వం కల్పిస్తుంది.

కొన్ని చక్కని బొమ్మలు ఇక్కడ దర్శించండి

Friday, June 13, 2008

ఆంధ్ర మాత -- గుర్రం జాషువా

||ఆంధ్రాలి మోదంబు నాశించి పోయినా
తిక్కనాకర్యుని వాణి త్రుప్తినంద

గజ్జెలందెల కాలు గడలించి మన్న బొ
బ్బిలి కోట దొలికోడి పలికి కులుక

నాడువీధులందు రత్నము లమ్ముకొన్నట్టి
తెలుగుల సంపత్తి తలపుకెక్క

ఖండాంతరముల బంగారు పూజలు గొన్న
కలికి పోగరమేను పులకరింప||


మూడు కొండల శివలింగములు రహింప
నాలశింపక రాష్ట్ర సింహాసనమున
నాధివశింపుము జయము నీయందు కలదు
దివ్యదాసయ సుమవల్లి తెలుగు తల్లి

గణ గాంధేయ శక ప్రకాశలాన మింకన్ శోక కాత్యంత ప్రా
క్తనపుంజీకటి చిందులాడెడు విముగ్ధ ప్రాంతముల్ నిద్ర మే
ల్కొన శంఖారవ మాచరింపు మిక నుగ్గుంబాలలో గాంతమం
దిన విధ్వాంశులగన్న వీర జనయిత్రీ ఆంధ్రరత్నాక్షితీ

కులముల్ గొమ్ములాటొడ గుమ్ముకొని చిక్కుల్ పెక్కు శృష్టించు పె
ద్దల కాలాలు గతించి పోయినవి స్వాతంత్య్రంబు సిధ్ధించె రా
జుల సింహాసన మెక్కినారు ప్రజ లెచ్చుందగ్గులం బాపూజీ
హలిక శ్రేష్టుడు దున్నినా డిపుడు లేవంతస్థు లాంధ్రాక్షితి

పెను స్వార్ధంబు మహా పిశాచమువలెన్ బీడింప దేశంబు చి
క్కిన శల్యంబయి తూలిపోయినది ఈ కీడుం దొలగించు చ
క్కని మార్గం బుపదే శమిచ్చుకొని ముక్తాస్వఛ్ఛభావంబు నీ
యనుగుం బిడ్డలలో సృజింపుము త్రిలింగాద్రిక్షమాభూషణీ

ఆలాపించిన సత్కవీశ్వరుల దివ్యాశీర్వచశ్శక్తిచే
నాలాభించిరి భారతీయులు స్వరాజ్య స్వర్ణ దండంబులే
డాలాలంబు కవి ప్రపంచమున కమ్మా వాజ్ఞ్మయోద్యానమున్
బాలింపగల దాతలం గని రసజ్ఞత్వంబు చాటింపుమీ

కృతులందుటకు పల్లకీ మోయ దొర కొన్న
కృష్ణరాయడు రాజ్యమేలినాడు

మనుమసిధ్ధియును దిక్కన గన్న కావ్యంబు
కొరచూపులు జూచుకొన్ననాడు

తెలుగురాయని యోప్పులొలుకు గుప్పిటిలోన
లేత కస్తూరి గుబాలించునాడు

ముత్యాల మందిరంబుల సత్కవులమీద
బంగార మేరులై పారునాడు


కవుల పల్కులు వేదవాక్యంబులగుచు
క్షితితలంచును గంపింప జేయునాడు
గారావంబుననన్నేల గాంచవైతి
తెలుపగదవమ్మ నన్నుగన్న తెలుగు తల్లి

అలసానికులజు డూయలమంచములనుండి
పసిడి లేఖను బూని వ్రాయునాడు
పోతనార్యుని గేహమున భారతీదేవి
చిగురుజేతుల వంట జేయునాడు
భువన భీకరుడు వేములవాడ భీమన్న
గంగ్రాజునకు జోలె గట్టునాడు
శ్రీనాధకవి పాండితీ వైభవము మీఱ
డిండిమభట్టు నొండించునాడు

కనుల జూచెడు భాగ్యంబు గలిగి యున్న
నేడు నా కవిత్వంబు రాణించియుండు
గారావంబుననన్నేల గాంచవైతి
తెలుపగదవమ్మ నన్నుగన్న తెలుగు తల్లి

జననం బందే నపూర్వవైఖరులతో, సంగీత సాహిత్య మం
డన నీ తెల్గుమిఠారి చెన్నపురి వీటన్ గజ్జెమ్రోయించుచున్
డనువుప్పొంగ బురాట నాంధ్ర విబవోద్యానంబురేకెత్త, మో
హన గానంబుల నాలాపింపగదవయ్యా ఆంధ్ర యోధాగ్రణీ

ఒకనాడాంధ్రుని కట్టి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విశ్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ మా
రక పోనీక సముధ్ధరింపు కొను మాంధ్రా వీర యోధాగ్రణీ

బోనావాడవుగాన నీదు విభవంబున్ సత్కలా మర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్ర ప్రపంచంబులో
మేలెల్లన్ గబలించినారు పరభూమీశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్

తలికోట యుధ్ధాన నళియ రాముని వల్ల
ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
సమియించె నీ బాలచంద్రరేఖ
బుధ్ధిమాలిన చిన్ని పొరపాటుకతనమున
విటమయ్యె నీ కొండవీటి పఠిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు

పరువు దూలిన నీ యనాదరణ కతన
మేఠి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యోత్తుము నీ వీర కాహలంబు

చీనా పెగోడాల సిగమీది పుష్పమై
పొడమె నీ రాతి చెక్కడపు చెణుకు
అరవ పాఠకుల తంబురకు ప్రాణమువోసి
కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవదిరులదాక జృంభించి పగవాని
తరిమి వెన్నాడె నీ కరకుఠాలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
నీ జగన్నాధ పండితుని పలుకు

యెందు జూచిన నీ యశస్వందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తఠంబుల యలర నెట్టింపవోయి
తెలుగు మన్నీల పశువు నిగ్గుల పతాక

తెలుగుం గేసరులున్ మహర్షులును గాంధీ శాంతి సేనాపతుల్
గలరాంధ్రప్రముఖుల్ త్వదీయులు భుజస్కంధంబు నండింత్రు నీ
అలఘ శ్రేయములీనమోచినవి రాష్ఠ్రార్ధంబు యట్నించి నీ
బలముంగొంచియ మాకలించుకొనరా ప్రఖ్యాత వీరాంధ్రుడా


-- -- గుర్రం జాషువా

Sunday, June 8, 2008

రాజా రవి వర్మ


రాజా రవి వర్మ (Raja Ravivarma) భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. 1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.

రాజా రవి వర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామ స్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్ఛ్యాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవి వర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవి వర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవి వర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్థి పొందింది.

రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగల కోసం విపరీతంగా ముద్రించటము వలన, భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించటము వలనా సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయిందనే విమర్శను ఎదుర్కొన్నాడు.

రాజ రవి వర్మ శైలి ప్రబావం ఎందరో ప్రముఖుల పైన ఉందని చెప్పొచ్చు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన దాదాసాహెబ్ ఫాల్కే కూడా రవి వర్మ చిత్రాల వల్ల ప్రభావితమైనవాడే.

భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.

క్రింది చిత్రాలు రాజా రవి వర్మ కు ఎంతో పేరు తెచ్చినవి:
పల్లె పడుచు
అలోచనలో మునిగిపోయిన స్త్రీ
దమయంతి హంస సంవాదము
వాద్యకారుల బృందము
సుభద్రార్జునులు
లేడీ విత్ ఫ్రూట్స్
హార్ట్ బ్రోకెన్
స్వర్బత్ ప్లేయర్
శకుంతల
శ్రీ కృష్ణ రాయబారము
రావణ జటాయు వధ
ఇంద్రజీత్ విజయము
బిక్షకుల కుటుంబము
లేడీ ప్లేయింగ్ స్వర్బత్
గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ
వరుణుని జయించిన రాముడు
నాయర్ల స్త్రీ
శృంగారంలో మునిగిన జంట
కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది
శంతనుడు మత్స్యగంధి
ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల
కణ్వుని ఆశ్రమములోని బాలిక.(ఋషి కన్య).

కొన్ని చిత్రాలను ఇక్కడ చూడండి

స్వాతంత్ర్యపోరాటంలో మన ఆంధ్ర ప్రదేశ్

స్వాతంత్ర్యపోరాటంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సంఘటనలకు సంబంధించి కొన్ని వ్యాసముల నుండి తీసుకొన్న సమాచారం ఈ క్రింది సంకలనం.

భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రపంచచరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. అహింసాయుతంగా స్వాతంత్ర్యోద్యమం జరిగినప్పటికీ, సాయుధ పోరాటాలు జరగకపోలేదు. 1913 - 1935 కాలంలో సాయుధ తిరుగుబాట్లు, కుట్రలు జరిగాయి. ముఖ్యంగా ఇవన్నీ బెంగాల్లోను, పంజాబు, ఇతర ఉత్తర భారత ప్రాంతాల్లోను జరిగాయి. దక్షిణాదిన చాలా తక్కువగా జరిగాయి.1933-35 ల్లో జరిగి, కాకినాడ కుట్ర కేసుగా ప్రసిద్ధి పొందిన విప్లవ ఘటన వాటిలో ఒకటి.

శాసనోల్లంఘనోద్యమం ఉధృతంగా ఉన్న రోజులవి. అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాలరెడ్డి, బులుసు సాంబమూర్తి, క్రొవ్విడి లింగరాజు వంటి నాయకుల నేతృత్వంలో ఉద్యమం జరిగింది. ఉద్యమాన్ని అణచివేసే పనిలో భాగంగా బ్రిటిషువారు నాయకులను జైల్లో పెట్టడం, ప్రజల ఇళ్ళలో సోదాలు చేసి భయభ్రాంతులను చెయ్యడం వంటి పనులు చేసారు. గుమిగూడిన ప్రజలపై అకారణంగా లాఠీచార్జి జరిపేవారు. పెద్దాపురంలో జరిగిన సంఘటన పోలీసుల దౌష్ట్యానికి ఓ ఉదాహరణ.

పెద్దాపురం ఘటన:
1930 డిసెంబరు 16 న పెద్దాపురం పట్టణంలో 80 మంది వరకు పెద్దలు, పిన్నలు ధనుర్మాస వనభోజనాల కోసం బొక్కా నారాయణమూర్తి గారి తోటలోకి చేరుకున్నారు. వత్సవాయి జగపతి వర్మ గారు అతిథేయి. క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణమ్మ అక్కడ చేరిన ప్రముఖుల్లో కొందరు. ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలనేది కూడా వారు చర్చించబోతున్నారు. ఈ సమాచారం తెలిసికొన్న సర్కిలు ఇన్స్పెక్టరు దప్పుల సుబ్బారావు తన బలగంతో అక్కడికి చేరుకున్నాడు. వనభోజనార్థుల చుట్టూ వలయంగా చేరి, చెదిరిపొమ్మని హెచ్చరిక చేసాడు. వాళ్ళకు చెదిరిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే లాఠీచార్జి చేయించాడు.

ఇదిలా ఉండగా గాంధీ-ఇర్విన్ ఒడంబడిక పర్యవసానంగా బ్రిటిషు ప్రభుత్వం ఉద్యమంపై బిగించిన ఉక్కు పిడికిలిని కొంత సడలించింది. శాంతియుతంగా పికెటింగు వగైరాలతో ఉద్యమం జరుపుకునేందుకు అనుమతించింది. జైళ్ళలో ఉన్న అనేకమంది ఉద్యమకారులను విడుదల చేసింది. ఆంధ్రలోనూ అనేకులు విడుదలయ్యారు. వారిలో ప్రతివాది భయంకరాచారి ఒకరు.

మిగతా దేశంలో వలెనే ఆంధ్ర లోనూ శాసనోల్లంఘనం కొనసాగింది. అయితే శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించుకోవచ్చని ఇచ్చిన హామీని విస్మరించి బ్రిటిషు ప్రభుత్వం అణచివేత చర్యలను కొనసాగించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అటువంటి చర్యల్లో ప్రముఖమైనవి కొన్ని:

వాడపల్లి కాల్పుల ఘటన:
1931 మార్చి 30 న వాడపల్లిలో పోలీసు కాల్పులు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి లో వెంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగుతూండగా జరిగిన సంఘటన ఇది. రథంపై దేవుడి విగ్రహాలతో పాటు జాతీయ నాయకుల ఫోటోలను కూడా ఉంచి ఊరేగిస్తున్నారు. తహసీల్దారుతో సహా అక్కడికి చేరుకున్న డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్, వాటిని తొలగించమని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ప్రజలపై కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

సీతానగరం ఆశ్రమ ఘటన:
ఇక రెండోది 1932 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో జరిగింది. సీతానగరం ఆశ్రమాన్ని మద్దూరి అన్నపూర్ణయ్య, మరికొందరి పర్యవేక్షణలో ఉంచి మిగిలినవారు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనేందుకు క్రొవ్విడి లింగరాజు నాయకత్వంలో కాకినాడ వెళ్ళారు. అప్పటికే - జనవరి 5న - ఆశ్రమం ప్రచురిస్తున్న “కాంగ్రెస్” పత్రికను చట్టవ్యతిరేకమైనదని ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ అక్కడికి చేరుకుని ‘ఈ ఆశ్రమాన్ని చట్టవిరుద్ధమైనదని ప్రకటించాం. దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి’ అని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ఆశ్రమవాసులపై విచ్చలవిడిగా లాఠీచార్జి చేసాడు. 75 ఏళ్ళ ముదుసలిని కూడా వదలకుండా అందరినీ అరెస్టు చేసాడు.

సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకరాచారిని ఈ సంఘటనలు కలచివేసాయి. సామర్లకోటలో పదవ తరగతి వరకూ చదివిన భయంకరాచారి విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ లో చేరి సగంలోనే ఆపేసాడు. విద్యార్థిగా ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదువు ఆపేసాక కొన్నాళ్ళు సీతానగరం ఆశ్రమంలో గడిపాడు. 19 ఏళ్ళ వయసులోనే లాహోరు కాంగ్రెసు సభలకు హాజరయ్యాడు. శాసనోల్లంఘనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1930 మేలో గురజనపల్లిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ననుసరించి ఇతర నాయకులతో పాటు తానూ విడుదలయ్యాడు. కన్ననూరు, బళ్ళారి జైళ్ళలో ఉండగా లాహోరు కుట్ర కేసు నిందితులు, బెంగాలు విప్లవకారులతో సంపర్కంలోకి వచ్చాడు. వారి వద్ద నుండి బాంబులు తయారుచేసే పద్ధతులు నేర్చుకున్నాడు.

భయంకరాచారి విప్లవ వీరులను ఆరాధించాడు. సంపూర్ణ విప్లవమే సంపూర్ణ స్వరాజ్యం తెస్తుందని నమ్మాడు. గాంధీ అహింసా మార్గాన్ని వ్యతిరేకించాడు. ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవోద్యమంలోకి ఉరకాలని ఉద్బోధించాడు. “యువతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకవసరమైన ఖర్చుల కోసం బ్యాంకులను దోచాలి..” అని అనేవాడు.

కాకినాడ బాంబు ఘటన:
ఉద్యమ నాయకులపై అన్యాయంగా లాఠీచార్జి జరిపిన డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు భయంకరాచారి. మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరిల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్. చారి అండ్ సన్స్ అనే ఓ బోగసు కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.

1933 ఏప్రిల్ 6 న కాకినాడలోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. ఏప్రిల్ 14 న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా ముస్తఫా వారనుకున్నట్టు రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబరు 11 న భయంకరాచారిని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.

డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.

ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మరి రెండు సంఘటనలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సమంజసంగా ఉంటుంది. బ్రిటిష్ పాలనలో తిరగబడిన సామాన్య ప్రజల ఆగ్రహజ్వాలల్లో ఒక ఆంగ్లేయాధికారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి కాగా ఆంగ్లేయాధికారులు ఒక సామాన్యుడిని పొట్టనబెట్టుకున్న ఘటన ఇంకొకటి:

కడప మసీదు ఘటన:
1832 జూన్ 15 సోమవారం నాడు ఎవరో ఒక పందిపిల్లను చంపి కడపలోని పెద్ద మసీదు (జుమ్మా మసీదు)లో పడేశారు. విషయం తెలిసిన ముస్లిములు కోపోద్రిక్తులయారు. “దీన్”, “దీన్” అని కేకలు వేసుకుంటూ వేలాది మంది ముస్లిములు గుంపులు గుంపులుగా మసీదు వద్దకు చేరుకున్నారు. సమయానికి కలెక్టరు లేకన్ ఊళ్ళో లేడు. ఆయన సబ్ కలెక్టరు మెక్డొనాల్డ్ ను మిలిటరీని తీసుకుని సంఘటనాస్థలానికి వెళ్ళి పరిస్థితి అదుపు తప్పకుండా చూడమని ఆదేశించాడు. పందిపిల్లను చంపిపడేసినవారి ఆచూకీ తెలిపితే రూ.500 లు బహుమతిగా ఇస్తామని చాటింపు వేయించాడు. యువకుడైన మెక్డొనాల్డ్ మిలిటరీ రాక ముందే తన సిబ్బందితో మసీదు వద్దకు చేరుకున్నాడు. అతడు అక్కడ గుమికూడిన ప్రజలకు నచ్చజెపుతూ ఉండగా ఒక యువకుడు హఠాత్తుగా మెక్డొనాల్డ్ పై దాడిచేసి కత్తితో రొమ్ముమీద పొడిచాడు. అంతలో అక్కడికి చేరిన సైన్యానికి కాల్పులు జరపమని ఆదేశాలిస్తూ మెక్డొనాల్డ్ సమీపంలోని ఇళ్ళలోకి దూరబోగా ఎవరూ రానివ్వలేదు. అంతలో మరో యువకుడు ఇంకో పోటు పొడిచాడు. మొదటిపోటు పొడిచిన యువకుడు సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడినా వెనుదీయక ఒక సైనికాధికారిని పొడిచి చంపి మరీ నేలకొరిగాడు.

ఈ సంఘటనలో మరణించిన సబ్ కలెక్టర్ మెక్డొనాల్డ్ యువకుడు. అప్పటికి కొన్ని నెలల క్రితమే అతడికి పెళ్లయింది. అతడి మరణవార్త విన్న భార్య ఆగ్నస్ దిగ్భ్రాంతికి గురై, కోమాలోకి వెళ్ళి 21 రోజుల తర్వాత కోమాలోనే చనిపోయింది. వీరిద్దరి సమాధులు కడప నగరంలో దొరల గోరీలు అనేచోట ఇప్పటికీ ఉన్నాయి.

పరాయి పాలన మీద పేరుకుపోయిన అసంతృప్తి, నిరసన భావాలే ఈ సంఘటనలో పెల్లుబికి ఈ హత్యాకాండకు దారితీశాయి. ఆంగ్లేయుల పాలనపై ప్రజల్లో అప్పటికే తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి ఉందని రికార్డులు చెప్తున్నాయి. 1857 తిరుగుబాటుకు ముందే ప్రజల చేతుల్లో ఒక ఆంగ్లేయాధికారి ప్రాణాలు కోల్పోయిన అరుదైన సంఘటనల్లో ఇదొకటి.

పలనాడు సత్యాగ్రహం
ఇక రెండోది స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన తొలి ఆంధ్రుడు కన్నెగంటి హనుమంతు గాథ (తెలుగు అకాడెమీ వారి బియ్యే చరిత్ర పుస్తకం, ఈభూమి పత్రికలో వచ్చిన “తెల్లవాడి తుపాకిని ఎదురొడ్డిన కన్నెకంటి హనుమంతు” వ్యాసం ఆధారంగా):
గుంటూరు జిల్లా పలనాడులో అటవీప్రాంతం అధికం. అక్కడి పేద ప్రజలు పుల్లరి, వంటచెరకు, ఎరువు ఆకు మొదలైన వాటికి గాను ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి వచ్చేది. వారిని అటవీశాఖాధికారులు, రెవెన్యూ ఉద్యోగులు నానా ఇబ్బందులు పెట్టేవారు. 1921 లో కరువు పరిస్థితుల వల్ల ప్రజలు పన్నులలో రాయితీలు కోరారు. అడవి నుండి వంటచెరకును ఉచితంగా తెచ్చుకొనేందుకు, నీటివనరులను వాడుకునేందుకు అనుమతి కోరారు. ఆవులను మేపుకోడానికి చెల్లించే 12 అణాల పన్నును 3 అణాలకు తగ్గించమని కోరారు.

ఈ వినతులను బ్రిటిషు పాలకులు పట్టించుకోలేదు. మాచర్ల, వెల్దుర్తి, శిరిగిరిపాడు, రెంటచింతల, ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పశువులను అడవిలోకి మేత కోసం తోలేవారు. అధికారులెవరైనా వాటిని బంధిస్తే, ప్రజలు మూకుమ్మడిగా వెళ్ళి వాటిని విడిపించుకొచ్చేవారు. నడిపాలెంలో వందగేదెలను అధికారులు నిర్బంధించగా, ఒక మహిళ నాయకత్వంలో ప్రజలు రేంజరుపై దాడి చేసి, వాటిని విడిపించుకున్నారు. అధికారులు కూడా వీరిని ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను సమీకరించుకొన్నారు.

అధికారుల నియంతృత్వ ధోరణికి ఆగ్రహించిన ప్రజలు అటవీ, రెవిన్యూ ఉద్యోగులను వెలివెయ్యడం మొదలుపెట్టారు. మాచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ అధికారులకు చాకలి, మంగలి మొదలైనవారి సేవలు దొరకలేదు. డిప్యూటీ తాసీల్దారు కుమారుడికి గుక్కెడు పాలు కూడా కరవయ్యాయి. రేంజరు, తదితర ఉద్యోగులను ఇళ్ళు ఖాళీ చేయించి, వారికి తమ ఇళ్ళను అద్దెకు ఇచ్చేది లేదని చెప్పేశారు.

పలనాట పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరు అక్కడికి వచ్చి, తన ఆదేశాలను గ్రామాల్లో చాటింపించేందుకు గాను తప్పెటవాళ్ళను పిలిపించాడు. వాళ్ళంతా తమ తప్పెట్లు చెడిపోయాయని చెప్పారు. గ్రామాధికారి కూడా వారిని సమర్ధించాడు. ఇదే సమయానికి అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెసు పార్టీ పనుపున ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి పలనాడు చేరుకున్నారు. వారి వలన శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందని భావించి, వారిని పూచీకత్తు చెల్లించమని కలెక్టరు ఆదేశించాడు. ప్రజలు వారిని తప్పెట్లతో ఊరేగింపుగా కలెక్టరు వద్దకు తీసుకువెళ్ళారు. చెడిపోయాయని తనకు చెప్పి, కాంగ్రెసు నాయకులను అవే తప్పెట్లతో స్వాగతించడం కలెక్టరుకు అవమానము, ఆగ్రహమూ కలిగించింది. పూచీకత్తు చెల్లించేందుకు నిరాకరించినందుకు గాను వారికి ఏడాది జైలుశిక్ష విధించాడు.

దీంతో రెచ్చిపోయిన ప్రజలు పన్నులు చెల్లించడం మానివేసి, పశువులను అడవిలోకి తోలారు. అటవీ నిబంధనలు అతిక్రమించవద్దని, పన్ను చెల్లించమని కాంగ్రెసు చెప్పినప్పటికీ ప్రజలు వినలేదు. పోలీసులతో ఘర్షణలూ జరిగాయి. వెల్దుర్తిలో రిజర్వు పోలీసు బలగంపై దాడి చేసి, వారి బంగళాను ఆక్రమించుకున్నారు. జెట్టిపాలెంలో పశువులను బంధించిన బందెలదొడ్డిపై దాడి చేసి, వాటిని విడిపించుకుపోయారు. దీంతో కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు మొదలైనవారు పలనాట విడిదిచేసి, పరిస్థితిపై కన్నేసి ఉంచారు.

ఈ సందర్భంలో మించాలపాడు వద్ద జరిగిన సంఘటన ప్రముఖమైంది. అధికారులు అక్కడి అడవిలో 300 పశువులను పట్టుకొని బందెలదొడ్డికి తరలిస్తూండగా వారిపై 300 మంది వరకు ప్రజలు దాడి చేసి, రాళ్ళు రువ్వారు. అధికారులు అందినవారిని అందినట్లు చితకబాదారు. చెన్నయ్య అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి ఊళ్ళోనుంచి చెన్నయ్య మామ కన్నెగంటి హనుమంతు పరుగున వచ్చాడు. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో చెన్నయ్యను కాపాడబోయిన కన్నెగంటి హనుమంతు, మరో ఇద్దరు మరణించారు. కాల్పులు జరిగింది సాయంత్రం 6 గంటలకైతే అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రాణాలతోనే ఉన్న హనుమంతు సమయానికి వైద్యసహాయం అందక మరణించాడు. అంతసేపూ క్షతగాత్రుడై పడి ఉన్న హనుమంతుకు మంచినీళ్ళివ్వబోయిన గ్రామస్థులను సైతం అధికారులు అడ్డుకున్నారు. తదనంతరం జరిగిన అణచివేత చర్యల కారణంగా పలనాట శాసనోల్లంఘనోద్యమం 1922 కల్లా చల్లబడింది. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర శాఖ ఈ ఉద్యమానికి సుముఖంగా లేకపోవడం ఉద్యమం చల్లారడానికి ఒక కారణం. ఈ ఉద్యమానికే పలనాడు సత్యాగ్రహం అని, పుల్లరి సత్యాగ్రహం అనీ పేరు వచ్చింది.

Saturday, February 2, 2008

అమీన్ సయాని - ప్రముఖ బ్రాడ్కాస్టెర్ -2

కమలా భట్ట్ గారు ఎందరో ప్రముఖుల పరిచయాలను తన రేడియో షో లొ పొందు పరచడం జరిగింది, వారి అనుమతి తో ఈ ఇంటర్వ్యూను పొస్ట్ చెయడం జరిగింది. వివరములకు కమలా భట్ట్ షో చూడండి.
Once again I am thanking kamla bhatt to allow me to use the interview in my blog. you can listen many interviews from her "kamala bhatt show". you may visit "http://kamlabhattshow.com" for more information.

మొదటి భాగం

రెండవ భాగం


మూడవ భాగం


నాలుగొ భాగం


ఐదవ భాగం



చివరి భాగం

వార్తలు..

 
వైశాఖి