అమీన్ సయాని, బ్రాడ్కాస్టింగ్ ప్రపంచం లొ పరిచయం చేయనవసరం లేని పేరు ఇది. రేడియో బ్రాడ్కాస్టింగ్ రంగం లొ కోట్ల కొలదీ అభిమానులు కలిగిన అమీన్ సయాని గురించి కొంత తెలుసుకొందం. గీత్ మాలా, బొర్న్ వీట క్విజ్ కాంటెస్ట్ లు లాంటి తన ప్రోగ్రాములు ద్వార అభిమాన సంగంలు కలిగిన ఎకైక రేడియో ఏనౌన్సర్ అమీన్ సయని అంటె అతిసయొక్తి కాదు.
అమీన్ సయాని రేడియో లొ మొదట ఇంగ్లిషు సెక్షను లొ పనిచేసినా, అతనికి తన మొదిటి గుర్తింపు ఓవల్టీన్ హింది ప్రకటన ద్వార వచ్చింది. ఇజానికి 1952సం ప్రారంబిచబడిన బినాక గీత్ మాల తరువతే అమీన్ సయాని ని రేడియో స్రోతలు ఎక్కువగ అభిమానించడం మొదలు పెట్టారు. వారనికి ఒక ఎపిసొడ్ చొప్పున ప్రసారమయ్యె ఈ ప్రోగ్రాం లో ప్రతీ ఎపిసొడ్ కి 25.00రూ చొప్పును ఇవ్వటానికి కుదిరిన ఒప్పందం ప్రకారం అమీన్ సయాని పాటల ఎంపిక, స్క్రిప్టింగ్ మరియు ప్రొగ్రాం నిర్వహణ, అంటే ప్రొగ్రాం కి వచ్చే ఉత్తరాలు ను కుడా పరిశీలించాలి.
నేను మొదటిసారి ఈ ప్రొగ్రాం 1980సం విన్నట్టు గుర్తు, అప్పటిలొ మాకు భొషాణమంత మర్ఫి డయొడ్ రేడియో ఉండెది. మనకి అప్పటికి సొంత అభిరుచులు, అభిప్రాయలు ఉండేవి కావు, మా అన్నయ్య అభిరుచులె మన అభిరుచులు, నిక్కరు తో వాడి వెంట లక్ష్మనుడి లా వెల్లటమె తెలుసు. అన్నట్టు చెప్పడం మరచాను మా అన్నయ్య పేరు రామ చంద్ర. తరువాత రోజుల్లొ ప్రతీ వారం గీత్ మాల వచ్చే టైం కి చదువు ఎగ్గొట్టి మరీ హజరు అయ్యెవాల్లం. కిషొర్ కుమార్ పాటలంటె నేను ఇష్టపడటానికి బహుసా ఇది కుడా ఒక కారణం అయ్యిఉంటుంది. సరె ఇక ఈ ప్రక్క దారి నుండి అసలు దారికి వద్దాం.
వారనికి 40-50 ఉత్తరాలు వస్తాయెమోనని అనుకొన్నా ఈ ప్రొగ్రాం కి మొదట ఎపిసొడ్ కి 9,000 జవాబులు రావడం బట్టి తెలుస్తుంది అప్పటిలొ అది ఎంత గొప్ప రేడియో ప్రొగ్రామో. ఒక్క సం లోనె ప్రతీ వారనికి 60,000 చొప్పును ఉత్తరాలు రావడం జరిగింది. 1954సం. నుండి 1గం. సమయానికి పెంచబడిన గీత్ మాలా కు 90 నుండి 120 మిలియన్ స్రోతలు ఉందేవారని అంచనా. తరువత కాలంలొ స్పొన్సర్ కంపనీ లలో మార్పుల వల్ల బినాక గీత్ మాల సిబాక గీత్ మాల గా, కొల్గేట్ సిబాక గీత్మాల గా 1990 దసకం వరకు బ్రాడ్కాస్ట్ చెయబదింది.
వచ్చె టపా లొ అమీన్ సయాని తొ ప్రముఖ ఇంటెర్నెట్ రేడియో బ్రాడ్కాస్టెర్ కమలా భట్ట్(Kamla Bhatt) చెసిన ఇంటెర్వ్యులను విందాం.